- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు దశాబ్దాల తర్వాత సెంచరీ దాటిన పార్టీగా బీజేపీ రికార్డు
న్యూఢిల్లీ: చరిత్రలో మొదటిసారి బీజేపీ రాజ్యసభలో 100 సీట్ల మార్క్‌ను చేరుకుంది. గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్‌లో నాలుగు స్థానాల్లో గెలుపొందింది. దీంతో 3 దశాబ్దాల తర్వాత ఎగువసభలో 100 సీట్ల మార్కును దాటిన పార్టీగా బీజేపీ అవతరించింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 108 స్థానాలతో కొనసాగింది. 1990 తర్వాత నెమ్మదిగా స్థానాలు కోల్పోతూ వచ్చింది. కాగా, గురువారం 13 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ నాలుగింట విజయం సాధించింది. దీనిలో బీజేపీ మిత్రపక్షం యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కూడా ఉంది. ఇక పంజాబ్‌లో ఐదు స్థానాల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీనే గెలుపు వరించింది. త్వరలో మరిన్ని స్థానాల్లో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రికార్డు పదిలంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.