వందేమాతర గీత రచయిత 'బంకించంద్ర ఛటర్జీ' జననం..

by Manoj |
వందేమాతర గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం..
X

దిశ, ఫీజర్స్ : ప్రముఖ బెంగాలీ కవి, సంపాదకుడు, వందేమాతర గీత రచయిత 'బంకించంద్ర ఛటర్జీ' 1838 జూన్ 27 జన్మించారు. బెంగాలీలో ఆయనను బంకించంద్ర ఛటోపాధ్యాయ్ అని పిలిచేవారు. అయితే ఛటోపాధ్యాయ్ అని పలకలేక బ్రిటిష్ వాళ్లు 'ఛటర్జీ' అని నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇదే క్రమంలో ప్రజలు కూడా వాళ్లనే అనుకరిస్తూ 'ఛటర్జీ' పేరునే కొనసాగించారు. ఇక గొప్ప రచయితగా పేరుగాంచిన ఆయన తను రాసిన 'ఆనంద్ మఠ్' అనే నవలనుంచి వందేమాతర గీతాన్ని సంగ్రహించారు.

భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసిన ఈ గీతం.. ప్రపంచ సాహిత్య చరిత్ర, జాతుల విముక్తి పోరాటాల్లో జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసింది. అలాగే నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకించంద్రచటర్జీ సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించగా.. చారిత్రక పాత్రలను, పూర్వ చారిత్రక వైభవ సన్నివేశాలను, సౌందర్య భావకతను ఆలంబనం చేసుకొని అద్భుతమైన రచనలు చేశాడని ప్రముఖ సాహితీవేత్తలు కొనియాడుతారు. ఇక ఆయన రాసిన వందేమాతరంతోపాటు దుర్గేషనందిని, కపాల్‌కుండల, దేవీ చౌదురాణి, ఆనంద్ మఠ్, బిషబ్రిక్ష వంటి రచనలు కూడా ప్రాచుర్యం పొందాయి.

Advertisement

Next Story

Most Viewed