- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ బాధితులకు గుండె జబ్బులు, మధుమేహం ముప్పు!
దిశ, ఫీచర్స్ : కొవిడ్ నుంచి కోలుకున్న చాలా వారాల తర్వాత బాధితులకు హృదయ సంబంధ సమస్యలు, డయాబెటిస్ తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం కనుగొంది. ఏడాది పాటు అర మిలియన్ సబ్జెక్టులను పరిశీలించిన మీదట యూకే పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏదేమైనా కరోనా వల్ల వచ్చే దీర్ఘకాలిక ఫలితాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
లండన్ కింగ్స్ కాలేజ్ పరిశోధకుల బృందం 4,28,650 మంది కొవిడ్-19 రోగుల హెల్త్ రికార్డ్స్ పరిశీలించింది. ఈ మేరకు కరోనా సంక్రమణ తర్వాత 12 నెలల్లో హార్ట్ డీసీజెస్‌తో పాటు డయాబెటిస్ బారిన పడుతున్నారని.. కార్డియోవాస్య్కులర్ అనుభవించే అవకాశం 55 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇన్ఫెక్షన్ తర్వాత కొవిడ్ తాత్కాలిక ప్రమాదాల గురించి మరింత కచ్చితమైన చిత్రాన్ని పొందేందుకు.. తీవ్రమైన కొవిడ్(ఇన్ఫెక్షన్ తర్వాత మొదటి నాలుగు వారాలు), పోస్ట్-అక్యూట్-కొవిడ్ (ఇన్ఫెక్షన్ తర్వాత ఐదు నుంచి 12 వారాలు), సుదీర్ఘమైన కొవిడ్(13 నుంచి 52 వారాలు సంక్రమణ తర్వాత) అంటూ మూడు మార్గాల్లో పరిశోధన కొనసాగించారు.
కొత్త మధుమేహ నిర్ధారణల పరంగా, కరోనా తర్వాత మొదటి నాలుగు వారాల్లో రోగి ప్రమాదం 81 శాతం పెరిగిందని అధ్యయనం కనుగొంది. ఆ తర్వాత మొదటి మూడు నెలల్లో, డయాబెటిస్ రిస్క్ సగటున 27 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్ఫెక్షన్ తర్వాత మొదటి నెలలో గుండె పరిస్థితుల్లో ఆరు రెట్లు పెరుగుదలతో, హృదయ సంబంధ సంఘటనల ప్రమాదం ట్రాక్ చేశారు. ఈ పెరిగిన ప్రమాదం తర్వాతి వారాల్లో నెమ్మదిగా క్షీణించింది. కాగా మూడు నెలల నాటికి బేస్‌లైన్ స్థాయిలకు తిరిగి వచ్చింది.
కరోనాతో కార్డియోవాస్య్కులర్ జబ్బులు రావడంలో స్పష్టత ఉందని, కానీ మధుమేహం వచ్చేందుకు గల కారణాలపై పరిశోధకుల బృందం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. SARS-CoV-2 ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్యాంక్రియాటిక్ కణాలను దెబ్బతీస్తుండటం వల్ల మధుమేహాన్ని వేగవంతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు కొవిడ్-19 బారినపడితే, అందుకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రభావాలను కచ్చితంగా అర్థం చేసుకునేందుకు సమయంతో పాటు తదుపరి పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.