- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్త్రీ లైంగిక స్వేచ్ఛను సమాజం అంగీకరించాలి... భూమి పెడ్నేకర్
దిశ, సినిమా: బి టౌన్ బ్యూటీ భూమి పెడ్నేకర్ సమాజంలో సంతరించుకుంటున్న అనేక సమస్యలపై యాక్టివ్‌గా స్పందిస్తుంది. ఈ క్రమంలోనే తను నటించిన 'బధాయి దో' చిత్రం ఇటీవలే విడుదలవగా ఇందులో స్వలింగ సంపర్కురాలి పాత్ర పోషించింది. అయితే ఈ పాత్ర పై సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ రాగా తాజాగా స్పందించిన నటి.. మనుషుల కలుపుగోలుతనం, స్వేచ్ఛ, అంగీకారం వంటి విషయాలపై మాట్లాడింది.
'మనం కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించడానికి స్వేచ్ఛ ఉండాలని నేను భావిస్తున్నాను. ఇది ఒక వ్యక్తిని ప్రేమించే స్వేచ్ఛ, లేదా ఇంకేదైనా కావచ్చు. జీవితం ఓ సుదీర్ఘ పోరాటం. కుటుంబం అనే గది నుంచి బయటపడితేనే విశాలంగా జీవించగలం. చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం, వ్యవస్థ, చట్టాలు అన్ని తెలుసుకుంటాం. ఈ చిత్రంలో స్వలింగ సంపర్కురాలైన 'సుమి' పాత్రలో నటించడం నా అదృష్టం గా భావిస్తున్నాను' అంటూ చెప్పిన నటి.. 'బదాయ్ దో' మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. చిత్రం చూసిన తర్వాత నన్ను చూసి నవ్వాలా? మేల్కొనాలా అనేది మీకే అర్థమవుతుంది. ఎవరేమనుకున్నా ఈ చిత్రం నాకు చాలా వ్యక్తిగతమైనది. ఎందుకంటే నాకు LGBTQIA కమ్యూనిటీకి చెందిన చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
https://www.instagram.com/p/CZUHqA1vWl1/?utm_source=ig_web_copy_link