కూసుమంచిలో భట్టి పాదయాత్ర

by Mahesh |   ( Updated:2022-08-09 10:51:02.0  )
కూసుమంచిలో భట్టి పాదయాత్ర
X

దిశ, కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో పాదయాత్ర సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం నుండి కొనసాగిన పాదయాత్ర కూసుమంచి బస్టాండ్ సెంటర్ వరకు చేరుకోగానే మహిళలు కార్యకర్తలు కోలాటం నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా బస్టాండ్ సెంటర్లో భట్టి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా ఆజాది కా గౌరవ యాత్రలో భాగంగా కూసుమంచి నుండి పెనుబల్లి మండలం వరకు 75 మందితో 75 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

ఈ యాత్రలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు సన్మానం, స్వతంత్ర సంగ్రామంలోని ముఖ్య ఘట్టాలు, వాటిని గుర్తించుకోవడం జరుగుతుందని, తెలిపారు. ఆనాడు స్వాతంత్రం సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ తల పెట్టినటువంటి కార్యక్రమాలు గుర్తుచేసుకుంటూ ప్రజలకు వివరిస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ అని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా అన్నారు. స్వాతంత్రం పోరాటంలో కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.స్వాతంత్ర సమయంలో బిజెపి పార్టీయే లేదని, వారి పాత్ర ఎక్కడ కూడా లేదని విమర్శించారు. మునుగోడులో గెలిచేది మా పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

గత 15 రోజులుగా వీఆర్ఏలు నిరసన దీక్ష కార్యక్రమాలు చేస్తున్నామని అయిన రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయినదని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని విఆర్ఏలు భట్టికి అందించారు. భట్టి వెంట జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవీ రెడ్డి, కూసుమంచి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు హఫీజుద్దీన్ కూసుమంచి మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య , వివిధ మండలాల మరియు కాంగ్రెస్ సర్పంచ్ లు ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed