దంతాలు ఊడిపోయాయా?.. ట్రై దిస్ ఫుడ్..

by Javid Pasha |
దంతాలు ఊడిపోయాయా?.. ట్రై దిస్ ఫుడ్..
X

దిశ, ఫీచర్స్ : ఒకానొక వయసులో మనుషులు దంతాలు కోల్పోక తప్పదు. దీంతో కొందరి మాట తడబడుతుంది. మరికొందరికి ఆహారం తీసుకోవడంలోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వయసులో ఆహారాన్ని నమలడం పెద్ద టాస్క్. తద్వారా డిఫిషియన్సీస్‌తో పాటు బరువు తగ్గి అనారోగ్యానికి గురవుతుంటారు. అలాంటి వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. మెత్తటి, మృదువైన ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. తగినంత పోషకాలతో కూడిన మెత్తటి ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఆరోగ్యకరంగా ఉంటారని చెబుతుండగా.. ఆ సాఫ్ట్ ఫుడ్ ఏంటో చూద్దాం.

1. పాలు లేదా జంతు ఉత్పత్తులు

సాధారణంగా పాల ఉత్పత్తులు మృదువైన ఆహారం కిందకు వస్తాయి. పైగా వీటిని సులభంగా తినొచ్చు. కాటేజ్ చీజ్, పెరుగు, క్రీమ్ చీజ్, కండెన్స్‌డ్ అండ్ డ్రై మిల్క్ లాంటి మృదువైన ఆహారం.. నమిలే అవసరం లేకుండానే ఈజీగా తినేయొచ్చు. గిలక్కొట్టిన గుడ్లు, ఫిష్ ఫిల్లెట్(ఎముకలేని చేప ముక్క) వంటి కొన్ని జంతు ఉత్పత్తులు మెత్తగా, తినడానికి సౌకర్యంగా ఉంటాయి. వీటిని సరిగ్గా ఉడికించినట్లయితే నమిలేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని సులభంగా తీసుకోవచ్చు.

2. ఉడికించిన ధాన్యాలు మరియు లెంటిల్స్

గ్రెయిన్స్ అండ్ లెంటిల్స్ నార్మల్‌గా నమలడం కష్టమే కానీ వాటిని ఉడికించడం ద్వారా అధిక ప్రోటీన్లు కలిగిన సూపీ స్టైల్ టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. వీటితో దాల్ రైస్ కిచ్డీ, పొంగల్ కిచ్డీ, సాబుదానా కిచ్డీ, బజ్రా ఖిచ్డీ లాంటి మెత్తటి ఆహారాన్ని తయారుచేసుకుని హాట్‌ హాట్‌గా తినొచ్చు.


3. అధిక కేలరీల సూప్‌లు

క్రంచీ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా ఎక్కువ కేలరీలు గల సూప్స్ తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. న్యూట్రియంట్ గ్యాప్‌ను ఫిల్ చేసే ఈ హై కేలరీ సూప్స్ తీసుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు. టొమాటో సూప్, స్వీట్ పొటాటో, లెంటిల్ సూప్, ఆస్పరాగస్ సూప్ ట్రై చేసి చూడమంటున్నారు.

4. ఓట్స్ మరియు గంజి

ఓట్స్ మరియు గంజిలో కూరగాయలు, ఇతరత్రా ఇంగ్రేడియంట్స్‌ను కలపడం ద్వారా పోషకాలు అధికంగా ఉండే భోజనంగా మార్చొచ్చు. కానీ ఓట్స్ జిగురు స్వభావం కారణంగా నమలడం కష్టమైన ఆహారాలుగా అనిపించవచ్చు కానీ కొంచెం అదనపు నీటిని జోడించడం వల్ల వోట్‌ మీల్‌ను సూప్ ఆకృతిలోకి మార్చొచ్చు. అంతేకాదు వీటికి అరటి పండు, మామిడికాయ, తురిమిన యాపిల్, చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలతో అలంకరిస్తే.. ఈ సూప్ మరింత డెలిషియస్‌గా మారుతుంది.

5. మెత్తని బంగాళదుంప

మెత్తని బంగాళదుంపను ఇంట్రెస్టింగ్ సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. పైగా నమలడానికి ఇబ్బందిలేని ఈ ఫుడ్ ఐటెమ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హమ్మస్, గ్వాకామోల్, చీజ్ డిప్స్.. లాంటి డిషెస్ దంతాలు లేనివారు ఎలాంటి రుచిని కోరుకున్నా సంతృప్తిపరిచే విధంగా ఉండటం విశేషం. పైగా ఈ సాఫ్ట్ ఫుడ్‌‌ ద్వారా శరీరానికి బోలెడు న్యూట్రియంట్స్ లభిస్తాయి.

Advertisement

Next Story