చెట్టు కింద యాచకుడు మృతి.. గ్రామస్తులు గమనించి..

by S Gopi |
చెట్టు కింద యాచకుడు మృతి.. గ్రామస్తులు గమనించి..
X

దిశ, శామీర్ పేట్: యాచకుడు మృతిచెందిన సంఘటన శామీర్ పేటలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాదం రవీందర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మజీద్ పూర్ గ్రామంలో యాచకుడిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ లోని నింబోలి అడ్డాకు చెందిన వ్యక్తిగా చెప్పుకునే అతను... గురువారం మజీద్ పూర్ గ్రామ పరిధిలోని తిరుమల వైన్స్ ముందు ఉన్న చెట్టు వద్ద విగత జీవిగా కనిపించాడు. గ్రామస్తులు గమనించి విషయాన్ని పోలీసులతోపాటు సర్పంచ్ కు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Next Story