షర్మిల పాదయాత్రలో ఆటంకం.. తేనెటీగల దాడి

by samatah |   ( Updated:2022-03-23 09:31:48.0  )
షర్మిల పాదయాత్రలో ఆటంకం.. తేనెటీగల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి మొదలైన ఈ పాదయాత్ర.. 34వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఇన్ని రోజులు సవ్యంగా జరిగిన ఈ పాదయాత్రలో బుధవారం అనుకోని ఆటంకం ఎదురైంది. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వారి మీదకు తేనెటీగలు దాడి చేశాయి. దారి పొడవున ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల,దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Next Story

Most Viewed