- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ నుంచి బేబమ్మ ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలోని తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’, నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’, ‘మనమే’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత స్టార్‌డమ్ అయితే అందుకోలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి బై బై చెప్పేసి మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను పలకరించనుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ మూవీలో SJ సూర్య, యోగిబాబు వంటి పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా కామెడీ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ‘ధీమా ధీమా’ అంటూ సాగే ఈ పాటను డైరెక్టర్ విగ్నేష్ రాయగా.. అనిరుద్ తన సొంత సంగీత దర్శకత్వంలో పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ తమిళ్‌లో వైరల్‌గా మారింది. మరి మీరు కూడా ఈ పాటను ఓ సారి వినేయండి.
(video link credits to sony music south youtube channel)
- Tags
- krithi shetty