- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Basara IIIT వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. విద్యార్థులు ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో: Basara IIIT Students Agitation Over Their Demands| మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తమ పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ముందు ఐదు వేల మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం 12 డిమాండ్లలో కేవలం 3 డిమాండ్లను నెరవేర్చి 7 డిమాండ్లను గాలికి వదిలేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీలో శుక్రవారం జరిగిన ఫుడ్ పాయిజన్ వల్ల 600 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేవలం మెస్‌లో తిన్న భోజనం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వం తమ పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తుందని అన్నారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులను ఎస్జీసీ టీమ్ పరామర్శించింది. నాణ్యమైన భోజనం పెట్టాలని ఎస్‌జీటీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. విద్యార్థులతో డైరెక్టర్ సతీష్ కుమార్ చర్చలు జరిపారు. మెస్ గురించి 8 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఆందోళనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: బాసర IIIT ఘటన: రెండు మెస్‌లపై కేసులు నమోదు
- Tags
- Basara IIIT