- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ పాదయాత్ర డేట్ ఫిక్స్.. ఆ ప్రాజెక్టే టార్గెట్..!
దిశ, తెలంగాణ బ్యూరో: గద్వాల జోగులాంబ అమ్మవారి సాక్షిగా ఏప్రిల్14వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తన రెండో విడుత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు పలు కీలక అంశాలను ఎజెండాలో పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ప్రాజెక్టులతో పాటు అవినీతి, కుటుంబ, నియంతృత్వ పోకడలకు పాతర పెట్టాలని ప్రజలకు వివరించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు చేస్తానని సీఎం ఇచ్చి మరిచిపోయిన హామీలైన డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ ఖాళీల భర్తీయే లక్ష్యంగా ముఖ్యమంత్రిని టార్గెట్చేయనున్నారు. కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో రెండో విడుత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్‌కుమార్(బీఎస్కే) షురూ చేపట్టనున్నారు. అలంపూర్నుంచి ఆదిలాబాద్వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్‌పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దక్షిణాది సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అన్యాయం చేశారని ప్రజల్లో ఇప్పటికే ముద్ర పడిపోయింది. ఇపుడు అదే సెంటిమెంట్‌ను ఈ యాత్రలో వినియోగించుకోవాలని బీఎస్కే వ్యూహరచన చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నంత వేగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల ఆలస్యంపై కేసీఆర్‌ను బీఎస్ కే కార్నర్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటనలో భాగంగా ఆ ప్రాజెక్టును సందర్శించి కుర్చీ వేసుకుని మరీ పనులు పూర్తయ్యేలా చూస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే రైతుల జీవితాలు బాగుపడుతాయని. తాగు, సాగునీటి కష్టాలు తొలగుతాయని అందరూ భావించారు. కానీ ఆ పనులు ఆలస్యమవుతుండటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటితో పాటు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బీజేపీ సీనియర్‌నేత డీకే అరుణ ను అడిగి వాటిపై కూడా యాత్రలో ప్రస్తావించాలని కాషాయనాథులు ప్లాన్చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్గతంలో పాలమూరు ఎంపీగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆ ప్రాంత ప్రజలకు ఏం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏడున్నరేళ్లలో ప్రజలకేం ఒరగబెట్టారని ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు కమలదళం సిద్ధమవుతోంది. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై సీఎం కేసీఆర్తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలేంటో ఈ యాత్ర ద్వారా తెలియజేయాలని బీజేపీ భావిస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో కూడా టీఆర్ఎస్ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇటీవల ప్రభుత్వం 30 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ఇచ్చింది. అయితే పీఆర్‌సీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనే అంశాన్ని యువతలో తీసుకెళ్లాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ప్రజా సమస్యలు, దళితులకు మూడెకరాల ఇండ్లు, దళిత బంధుపై ప్రశ్నించేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అర్హులకు కాకుండా కేవలం టీఆర్ఎస్నేతలకే దళిత బంధు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై కూడా పూర్తిస్థాయిలో నివేదికలు తెప్పించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా బీజేపీ వ్యూహరచన చేస్తోంది.