Banana: మహిళల్లో జాయింట్ నొప్పులు.. ఈ పండుతో చెక్ పెట్టండి..?

by Anjali |
Banana: మహిళల్లో జాయింట్ నొప్పులు.. ఈ పండుతో చెక్ పెట్టండి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చాలా మంది జాయింట్ నొప్పుల(Joint pains)తో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో కీళ్ల నొప్పులు సాధారణం అయిపోయాయి. హార్మోన్ల మార్పులు(Hormonal changes), రుతుక్రమం ఆగడం (Menstruation) వంటి కారణాల వల్ల మహిళల్లో కీళ్ల నొప్పులు అధికమవుతున్నాయి. ఈస్ట్రోజెన్ స్థాయిలు (Estrogen levels) తగ్గడం, రుతుక్రమం ఆగడం, మృదులాస్థి క్షీణత(Cartilage degeneration), ఎముక సాంద్రత తగ్గడం(Decreased bone density), కీళ్ల వాపు (Joint inflammation) వంటివి మహిళల్లో జాయింట్ పెయిన్‌కు కారణమవుతాయి.

కాగా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మందులు తీసుకోవడం, మసాజ్(Massage) చేయడం వంటివి చేస్తే ఈ సమస్య దూరం అవుతుంది. ఈ నొప్పుల లక్షణాలు చూసినట్లైతే.. నొప్పి అకస్మాత్తుగా లేదా నెమ్మదిగా ప్రారంభమవడం జరుగుతుంది.

నొప్పి స్థిరంగా ఉండడం లేదా వచ్చి పోవడం, నొప్పి మరింత తీవ్రమవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అరటిపండు తినడం వల్ల మహిళల్లో జాయింట్ నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లు (Bananas) ప్రతి రోజూ తింటే కేవలం ఈ నొప్పులకే కాదు.. కడుపులో మంట (Stomach inflammation) కూడా తగ్గుతుంది. ఇన్ఫ్లేమేషన్ గుణాల(Properties of inflammation) తగ్గించడంలో మేలు చేస్తుంది.

అరటిపండులో విటమిన్లు(Vitamins), పోషకాలు, మినరల్స్(Minerals), దట్టంగా ఉంటాయి. కాగా ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే బనానాలో అధిక పొటాషియం(Potassium) ఉంటుంది. ఇది పరోక్షంగా బోన్స్ ఆరోగ్యాన్ని కల్పించి.. జాయింట్ పెయిన్ ను తగ్గించడంలో తోడ్పడుతుంది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants) కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. బనానా తింటే ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తుంది. అలాగే వీటిలో ఉండే మెగ్నిషీయం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అర్థరైటిస్ వంటి ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story