Bala Krishna: సూపర్ హీరోగా బాలయ్య.. ఆ పాత్ర సినీ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ సృష్టిస్తుంది

by Prasanna |
Bala Krishna: సూపర్ హీరోగా బాలయ్య.. ఆ పాత్ర  సినీ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ సృష్టిస్తుంది
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేసారు. సినిమాలు మాత్రమే కాకుండా ఆహా ఓటీటీలో కూడా అన్‌స్టాపబుల్ అనే షోలో హోస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇంకో వైపు హిందూపూర్ లో వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇలా బాలయ్య ఓ వైపు సినిమాల్లో, మరో వైపు షోలలో, రాజకీయాలలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం, బాబీ డైరెక్షన్ లో NBK109 మూవీ చేస్తున్నారు బాలయ్య. అయితే, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది.

బాలకృష్ణ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నారని టాక్ బాగా నడుస్తుంది. అయితే, అది సినిమాలోనా లేక బయట హీరోగానా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన అనౌన్స్ అక్టోబర్ 11న వస్తుందని తెలిసిన సమాచారం. ఈ పాత్ర తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ సృష్టిస్తుందని సినీ వర్గాల అంటున్నారు. దీంతో, నందమూరి అభిమానులు ఆసక్తిగా దీని కోసం వేచి చూస్తున్నారు.

Advertisement

Next Story