- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Yash: అందరికీ ఓ విన్నపం.. దయచేసి నా మనసు గాయపడేలా ప్రవర్తించకండి.. యశ్ ఎమోషనల్ నోట్
దిశ, సినిమా: యశ్(Yash) ‘కేజీఎఫ్’ సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’(Toxic) షూటింగ్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, యశ్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ‘‘నా పుట్టిన రోజున ఎలాంటి ఆడంబరాలు, హంగామా చేయకండి. నేను సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. ఆ పనుల వల్ల ఈ పుట్టిన రోజున నేను ఊర్లో ఉండడం లేదు.
దయచేసి మీ అందరికీ ఒక విన్నపం. నా పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బ్యానర్లు(Flexi, banners) అంటూ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయవద్దు. మరోసారి నా మనసు గాయపడేలా ప్రవర్తించకండి. మీకు ఓ కుటుంబముంది. వారికీ మీ అవసరముంది. వీలైనంత త్వరగా మీ అందరినీ కలుస్తాను. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అని రాసుకొచ్చారు.
కాగా, గత ఏడాది యశ్ పుట్టిన రోజు నాడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వారికి కుటుంబాలను కలిసి అండగా ఉండానని మాటిచ్చారు. అందుకే ఈ సారి పుట్టినరోజు అలా జరగకూడదని తన పుట్టినరోజుకు (జనవరి 8) 9 రోజులు ఉండగానే అభిమానులను విజ్ఞప్తి చేశారు.