- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజల అవసరాలు.. అధికారుల వసూళ్లు

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వం అందించే పౌర సేవలు పారదర్శకంగా కొనసాగాలి. కానీ అధికారులు ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వం అందించే పౌర సేవలు పారదర్శకంగా కొనసాగాలి. కానీ అధికారులు ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వం అందించే పౌర సేవలు పారదర్శకంగా కొనసాగాలి. కానీ అధికారులు ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతం లోని రైతులు, నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు విద్యుత్ శాఖ అధికారులతో మమేకమై పనిచేస్తారు. బహుళ అంతస్థులు నిర్మించే యజమానులు విద్యుత్ కనెక్షన్ పర్మిషన్ కోసం ప్రైవేట్ కాంట్రాక్టుకు అప్పగిస్తారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ విద్యుత్ శాఖాధికారులతో కుమ్మకై వ్యవహరిస్తారు.. ఆ ఇంటి యాజమాన్యంతో గానీ, ట్రాన్స్ ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతు, రియల్ వెంచర్ దారులతో అడిగినంత ఇప్పించకుంటే తప్ప కనెక్షన్ మంజూరు కాదు. ఈ విధంగా జిల్లా లోని సెక్షన్ అధికారులు తీవ్రంగా కాసుల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆధారాలతో మరిన్ని కథనాలు ప్రచురితం కానున్నాయి.
జీ+4 నిర్మాణం ఉంటే..
రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగానే నిర్మాణాలు జరుగుతున్నాయి. జీ+2 నిర్మాణానికి అనుమతులు తీసుకుంటే జీ+4, పెంట్‌హౌస్‌గా నిర్మాణాలు చేస్తున్నా రు. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు చేతి వాటాలకు అలవాటు పడి నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. అదే పద్ధతిని విద్యుత్ శాఖాధికారులు కొనసాగిస్తున్నారు. అనుమతికి మించి నిర్మాణాలు చేస్తే పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తారు. ఒక వేళ అనుమతి ప్రకారం పవర్ ట్రాన్స్ ఫార్మర్ దరఖాస్తు పెడితే కనెక్షన్ మంజూరులో జాప్యం జరుగుతుంది. దీంతో అర్హులైన సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్ల సెక్షన్ పరిధిలో అధికంగా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రభావితం చేసే రైతులకు ముందు..
రైతులకు కేటాయించే ట్రాన్స్ఫర్మర్లోను అదే తీరును విద్యుత్ శాఖాధికారులు ప్రదర్శించడం బాధగా ఉంది. రైతుకు మూడు బోర్లు ఉండి.. మూడు డీడీలు విద్యుత్ శాఖ పేరుతో ఉండి దరఖాస్తు చేసుకోవాలి. దీంతో అధికారులు దరఖాస్తు ఆధారంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎస్టిమేషన్ వేసి నిబంధనల ప్రకారం కేటాయింపు ఉంటుంది. కానీ ఎలాంటి ఎస్టిమేషన్, దరఖాస్తులు లేకుండా సంబంధిత అధికారులు చేతులు తడిపితే చాలు నిబంధనలతో పనిలేదు.. ట్రాన్స్ ఫార్మర్ పెట్టేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అనుమతులు లేకుండానే లైన్ షిఫ్ట్..
ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల విద్యుత్ సెక్షన్ కార్యాలయం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదిభట్ల కరెంట్ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేట్ వెంచర్లో ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేకుండా స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏకపక్ష నిర్ణయం తో లైన్లు మార్చినట్లు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.