మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ ఫ్యామిలీ

by Veldandi saikiran |
మార్క్ శంకర్ తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ ఫ్యామిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కుటుంబం సింగపూర్ ( Singapore) నుంచి ఇండియాకు చేరుకుంది. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో ( Mark Shankar) ఇండియాకు తిరిగి వచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో... ఇండియాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని.. ఎయిర్ పోర్టులో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది.

పవన్ కళ్యాణ్ కుటుంబంతో పాటు జనసేన యంగ్ లీడర్ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎయిర్ పోర్టులో దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్... ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని ప్రమాదం నుంచి అతను కోల్కున్నట్లు ఈ వీడియో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇండియాకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ.. మళ్లీ హైదరాబాదులో కూడా తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఛాన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రెగ్యులర్ గా మార్క్ శంకర్ కు ట్రీట్మెంట్ అందించే ఛాన్సులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా నాలుగు రోజుల కిందట పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ( Mark Shankar) సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.



Next Story

Most Viewed