- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆజాన్ మోగించడం ఆపితేనే హనుమాన్ చాలీసా ప్లే చేయడం ఆపుతాం!
ముంబయి : మహారాష్ట్రలో ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మసీదు వెలుపల మైకుల ద్వారా భారీ శబ్దంతో ఆజాన్ మోగించడం ఆపితేనే తాము కూడా హనుమాన్ చాలీసా ప్లే చేయడం ఆపుతామని బీజేపీ లీడర్ మోహత్ కాంబోజ్ తేల్చిచెప్పారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కావాలంటే ఉచితంగా లౌడ్ స్పీకర్లు పంపిణీ చేసేందుకు సిద్ధమన్నాడు. 'ఆలయంలో లౌడ్‌స్పీకర్‌ని ఏర్పాటు చేయడానికి ఎవరైనా ఉచితంగా అడగవచ్చు. హిందువులందరూ ఒకే స్వరంతో ఉండాలి. జై శ్రీ రామ్! హర్ హర్ మహాదేవ్!' శబ్దాలతో వీధులన్నీ మారుమోగాలని బిలియనీర్, బీజేపీ లీడర్ మోహిత్ కాంబోజ్ పిలుపునిచ్చాడు. బీజేపీ, రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్) పార్టీలు మసీదు వెలువల ఆజాన్‌ను మైకుల ద్వారా భారీ శబ్దంతో మోగించడం నిషేధించాలనే పిలుపును తీవ్రతరం చేయడంతో మోహత్ కాంబోజ్ ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది.
మరాఠీ నూతన సంవత్సర పండుగ గుడి పడ్వా సందర్భంగా ముంబైలో జరిగిన ర్యాలీలో రాజ్ థాకరే పిలుపు మేరకు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లోని ఎమ్‌ఎన్‌ఎస్ నాయకులు లౌడ్ స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా ప్లే చేయడం ప్రారంభించారు. కాగా, దేశంలోనే అత్యంత సంపన్నమైన మునిసిపల్ బాడీ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుతో నడుస్తున్న శివసేన ప్రభుత్వాన్ని కార్నర్ చేసి మెజార్టీ హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ, రాజ్ థాకరే ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది.