సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా.. ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులు!

by Vinod kumar |
సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా.. ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఉత్తమ మహిళా ఉద్యోగులకు, మహిళ ఉపాధ్యాయునీలకు పురస్కారాల పంపిణీ బిసిటియు ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం నగరంలోని రాజీవగాంధీ ఆడిటోరియంలో బిసిటియు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడ వేటి వినోద్ ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని ఉత్తమ మహిళా ఉద్యోగుల పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ విఠల్, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతుకిరణ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ లు అతిథులుగా హాజరై పురస్కారాలను అందచేశారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త అని ఉపాధ్యాయిని, రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య అని, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిన వ్యక్తి సావిత్రిబాయి ఫూలే అని తెలియజేస్తూ, మహిళలు కూడా అన్ని రంగాల్లో ఎదుగుటకు కృషిచేయాలని కోరినారు. రాష్ర్ట బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించడం కోసం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా యూనివర్సిటీ ప్రొఫెసర్ త్రివేణి, బుస్స ఆంజనేయులు, బ్రహ్మకుమారి బెహన్, ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed