కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: ఆవుల రాజి రెడ్డి

by Satheesh |
కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: ఆవుల రాజి రెడ్డి
X

దిశ, హత్నూర: అసెంబ్లీలో స్పీకర్ తీరును నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మంగళవారం హత్నూర మండల దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్షాలను అవహేళన చేసే విధంగా కేసీఆర్ వైఖరి ఉందంటూ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొ్న్నారు.

Advertisement

Next Story