'దిశ' కథనానికి స్పందన.. ఎంతటి వారైన ఊరుకునే ప్రసక్తే లేదు.. కలెక్టర్ సీరియస్

by Satheesh |
దిశ కథనానికి స్పందన.. ఎంతటి వారైన ఊరుకునే ప్రసక్తే లేదు.. కలెక్టర్ సీరియస్
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్పూర్​పెద్ద చెరువు కబ్జా, ఆక్రమణపై అధికార యంత్రాంగం కదిలింది. 'చెరబట్టి.. గూడు చెడగొట్టి' అనే శీర్షికతో 'దిశ' పత్రికలో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. 'దిశ' కథనంతో జిల్లా కలెక్టర్​తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ చేపట్టాలని ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, అధికారులను ఆదేశించారు. దీనితో శనివారం నీటిపారుదల శాఖ డివిజనల్​ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్​రామస్వామి, ఏఇ ప్రసాద్, రెవెన్యూ అధికారులు కబ్జాకు గురవుతున్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు.

పెద్ద చెరువు జీవవైవిద్య ప్రాంతంగా గుర్తింపు పొందిన విషయం కూడా విధితమే. కాగా గత కొంత కాలంగా స్థానికంగా కొందరు రియల్టర్లు చెరువును కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే పదులు సంఖ్యలో లారీలు, ప్రొక్లైనర్లతో మట్టిని తరలించి చెరువులోకి రోడ్లు వేస్తున్నారు. చదును చేసిన భూమిని ప్లాట్లు చేసి అమ్మకాలు కూడా చేపడుతున్నారు. చెరువు ఆక్రమణపై 'దిశ' పత్రిక వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. స్పందించిన అధికారులు చెరువులోని బఫర్​జోన్, ఎఫ్‌టీఎల్​పరిధులను పరిశీలించారు. చెరువు కబ్జాకు

గురవుతుందని అందోళన వ్యక్తం చేశారు. పెద్ద చెరువు ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని ఇరిగేషన్​డీఈ రామస్వామి తెలిపారు. చెరువును ఆక్రమించుకున్న వాళ్లు కొందరు అందులో ప్లాట్లు చేసి అమ్మకాలు చేయగా వాటిని కొనుగోలు చేసిన వారు తాము డబ్బులు వెచ్చించి ప్లాట్లు కొన్నామని కోర్టును ఆశ్రయించారు. అయితే చెరువు భూమిని అమ్మడానికి ఎవరు..? కొనడానికి వారెవరు..? అని అధికారులు ప్రశ్నించారు. ప్లాట్లు కొన్న వారు కోర్టు తమకు అనుకూలంగా ఉన్నదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అక్రమార్కుల ఆటలు కట్టించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నతట్లు స్థానికులు చెబుతున్నారు.

చెరువు భూమిని అమ్మి, అదే భూమిని కొనుగోలు చేసిన వారు కోర్టుకు వెళితే వారిని ప్రశ్నించకుండా అధికారులు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇరిగేషన్​అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు ఆర్డర్లతో అక్రమార్కులు తప్పుదారి పట్టిస్తుంటే ఇరిగేషన్​అధికారులు కనీసం కౌంటర్​దాఖలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూమిని కబ్జా చేసి తిరిగి అధికారులను భయపెడుతుంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఓ నాయకుడు ఎద్దేవా చేశారు.

క్రిమినల్​కేసులు నమోదు చేస్తాం.. కలెక్టర్​ హనుమంతరావు

అమీన్​పూర్​పెద్ద చెరువును కబ్జా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్​ హనుమంతరావు హెచ్చరించారు. రాత్రికి రాత్రి చెరువును పూడ్చుతున్న లారీలు, జేసీబీ యంత్రాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ వద్దకు వచ్చాయన్నారు. 'దిశ' పత్రిక కూడా చెరువు కబ్జాపై కథనాలు ప్రచురితం చేసింది. అ క్రమంలోనే విచారణకు అధికారులను ఆదేశించారు. విచారణ కొనసాగుతున్నది. చెరువును కబ్జా చేస్తున్న వారు ఎంతటి వారైనా ఊరుకునే ప్రసక్తే లేదు. తక్షణమే వారిపై క్రిమినల్​కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించనట్లు కలెక్టర్​హనుమంతరావు 'దిశ' ప్రతినిధితో వెల్లడించారు. అమీన్​పూర్‌లో అవినీతి, అక్రమాలు, కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రత్యేక దృషి సారించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed