South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. ఆ రైళ్లు రద్దు చేస్తూ నిర్ణయం..

by Satheesh |   ( Updated:2022-06-17 14:15:12.0  )
South Central Railway decides To Cancel Some trains
X

దిశ, వెబ్‌డెస్క్: South Central Railway decides To Cancel Some trains| అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులు పలు రైళ్లుకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనితో దక్షిణ మధ్య రైల్వే రాకపోకలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్‌కు బదులు మౌలాలి నుండి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సిర్పూర్ కాగజ్ నగర్, హౌరా, గుంటూర్ రైళ్లు మౌలాలి స్టేషన్ నుండి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్- ముంబై ఎక్స్‌ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఈస్ట్ కోస్ట్, శబరి, ఫలక్ నుమా, ధనపూర్, షిర్డి, ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed