- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్లాపూర్‌లో అధికార పార్టీ వర్గాల మధ్య దాడులు.. పలువురికి గాయాలు
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుల మధ్య జరిగిన పరస్పర దాడులు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత.. జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులుగా విడిపోయి వేరు వేరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగినట్లుగా అధికార పార్టీలోనే రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు, సభలు సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ వస్తోంది. ఒకరకంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ లో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఆదివారం రాత్రి కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి గ్రామంలో ఇసుక రవాణా అంశానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులుగా విడిపోయి రాజకీయ ఆధిపత్యం కోసమే కాకుండా, ఇసుక వ్యాపారాలలోనూ.. ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇసుక క్వారీల్లో తవ్వకాల అంశంపై ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పర దాడికి పూనుకున్నారు. ఈ ఘటనలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ తో పాటు ఇరు వర్గాల వారికి గాయాలు అయినట్లు సమాచారం. కొన్ని వాహనాలు కూడా ధ్వంసం అయినట్లు తెలిసింది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అర్ధరాత్రి దాటిన తర్వాత ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం ఇరు వర్గీయులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై విచారణ చేసి కేసు నమోదు చేయడానికి పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.