- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
First Flight Journey: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్‌లో గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?
దిశ, వెబ్‌డెస్క్: ఎవరికైనా సరే మొదటిసారి ట్రైన్ జర్నీ(Train Journey) అన్నా.. విమానం(aeroplane)లో ప్రయాణించాలన్నా కాస్త భయంగానే ఉంటుంది. కంగారుగా కూడా ఉంటుంది. కాగా ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్(airport) లో ఏం చేయాలి? విమాంలో ఎలా ఉండాలి? వంటి పలు విషయాలు ముందే తెలుసుకుంటే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాక ఎలాంటి కంగారు పడకుండా ఉంటారు. అలాగే ప్రయాణం కూడా మరింత సులువు అవుతుంది. ఈ స్మాల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రయాణానికి ముందు చెక్ చేసుకోవాల్సినవి..
ముందుగా అందరూ తప్పకుండా చెక్ చేసుకోవాల్సింది.. పాస్ పోర్ట్ అప్డేట్(Passport Update) ఉందా? లేదా? అని కచ్చితంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే ముందే ఫ్లైట్ అప్డేట్ తెలుసుకోవాలి. విమానం రావడం లేట్ అవుతుందా? లేక క్యాన్సిల్ అయిందా అనే విషయాన్ని గమనించాలి. విమానంలో ఇష్టమొచ్చినంత లగేజీ తీసుకెళ్లడానికి వీలుండదు.
కాగా ఎయిర్ లైన్ కంపెనీ(airline company) ఎన్ని బ్యాగులు, ఎంత వెయిట్ ఇస్తుందో ముందే ఇంట్లోనే బరువును చెక్ చేసుకుని వెళ్లాలి. దీంతో అక్కడికి వెళ్లాక ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఒక చిన్న బ్యాగ్ మీతో పాటుగా ఉంచుకోవచ్చు. అందులో పాస్ పోర్ట్(Passport) ల్యాప్ టాప్ (Laptop), వ్యాలెట్ (Wallet), చార్జర్ (Charger), మీ గుర్తింపు కార్డులు లాంటివి బ్యాగులో పెట్టుకుని మీకు దగ్గరగా పెట్టుకోవచ్చు. అలాగే విమానంలో కొన్ని రకాల వస్తువులు అనుమతించరు. పదునైన వస్తువులు, మంటను ప్రేరేపించేవి, పలు రకాల మందులు, బ్యాటరీలు వంటివి.
ప్రయాణం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు...
మీరు పిల్లలతో ప్రయాణిస్తున్నట్లైతే అల్లరి చేయకుండా చూసుకోవాలి. లేకపోతే పక్కవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాగా వాళ్లు ఏడవకుండా, అరవకుండా ఉండటానికి పిల్లలకు ఆటవస్తువులు లాంటివి దగ్గరగా ఉంచాలి. అలాగే సీట్ వెనక్కి రిక్లైన్ (Recline) చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వెనక ప్యాసెంజర్ ను గమనిస్తే చాలు. లాంగ్ జర్నీ(Long Journey) అయినట్లైతే.. మీతో ఐ మాస్క్ (Eye Mask), నెక్ పిల్లో(Neck Pillow) వంటివి తీసుకెళ్లండి. హ్యాపీగా, హాయిగా నిద్రించవచ్చు. ఇక సీట్ బెల్ట్ (Seat Belt) ఎలా పెట్టుకోవాలి? ఆక్సీజన్ మాస్క్ (Oxygen Mask) ఎలా తీసుకోవాలి? ప్రాణాపాయ స్థితి వస్తే లైఫ్ జాకెట్ ఎలా ఉపయోగించాలి? ఎమర్జెన్సీ డోర్లు ఎటు సైడ్ ఉంటాయి? వాటిని ఎలా వాడాలన్నా విషయాలు విమాన సిబ్బంది ముందుగానే వివరిస్తారు. కాగా విమానంలో మొదటిసారి వెళ్లేవారు పైన విషయాలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలాంటి కంగారు ఉండదు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.