Hypothyroidism: ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఈ వ్యాధికి సంకేతం!!

by Anjali |   ( Updated:2024-11-02 11:59:12.0  )
Hypothyroidism: ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఈ వ్యాధికి సంకేతం!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జీవన శైలిలో మార్పుల కారణంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో థైరాయిడ్ సమస్య ఒకటి. ఈ వ్యాధి ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం. రెండు హైపర్ థైరాయిడిజం. మరీ దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రెండు రకాల థైరాయిడ్లు మనిషిని పూర్తిగా నీరసంగా మార్చేస్తాయి. ఈ వ్యాధి మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరీ ఆడవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే హైపోథైరాయిడ్‌కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

ముఖ్యంగా హర్మోన్లలో మార్పులు కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో, ప్రెగ్రెన్సీ అయినప్పుడు, మెనోపాజ్ టైంలో ఆడవాళ్లలో మార్పులు కనిపిస్తాయి. కాగా మహిళలు అప్పుడప్పుడు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి బారిన పడితే బద్ధకం పెరిగిపోతుంది. ఏ పని చేసిన తొందరగా అలసిపోతారు. అసహనంగా ఫీల్ అవుతుంటారు. చలిగిలి తాకినట్లైతే చికాకు వస్తుంది.

అలాగే పీరియడ్స్ ఎక్కువ రోజుల పాటు అవుతుంది. అంతేకాకుండా ఒక నెలలోనే ఎక్కువసార్లు పీరియడ్స్ వస్తాయి థైరాయిడ్స్ సరిగ్గా పనిచేయక హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుని.. వెయిట్ పెరుగుతారు. శరీరంలోని కొవ్వు నిల్వలను పెంచుతుంది. దీంతో అనూహ్యంగా బరువు పెరుగుతారు.

ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే హెయిల్ ఫాల్ పుష్కలంగా అవుతుంది. స్కిన్ పొడిబారిపోతుంది. కనుబొమ్మలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ లక్షణాలతో పాటు మహిళలకు కీళ్ల నొప్పులు వస్తాయి. కండరాలు బలహీనంగా మారిపోతాయి. ఏ పనిమీద శ్రద్ధ పెట్టలేకపోతారు. మానసికంగా కూడా బద్ధకంగా అనిపిస్తుంది. కాగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కనుక మహిళలు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed