- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Diwali 2024: దీపావళి నాడు కలలో ఈ వస్తువులు కనిపిస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంతో ఎంతో పవిత్రమైన పండుగల్లో దీపావళి()Diwali ఒకటి. తెలుగు ప్రజలు దీపావళి ఫేస్టివల్‌ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పలు ప్రాంతాల్లో అయితే దీపావళిని 5 రోజుల పాటు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అతిథులను ఆహ్వానించి.. బహుమతులు సమర్పించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. బాణాసంచా పేలుస్తూ ఐదు రోజులు ఎంతో సంతోషంగా గడుపుతారు. దీపావళి అంటే చిన్న పిల్లలకైతే ఎంతో ఇష్టమైన పండుగ. ఇకపోతే స్వప్న శాస్త్రం(Dream Science) ప్రకారం.. దీపావళి నైట్ ఈ విధంగా కలలు వస్తే వారిపై అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు(astrology experts) చెబుతున్నారు. ఏ రకమైన కలలో ఇప్పుడు చూద్దాం..
అమ్మవారు కనిపిస్తే...
శోభ, ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దీపావళి నాడు రాత్రి కలలో అమ్మవారు కనిపిస్తే చాలా శుభప్రదంగా చెప్పుకుంటారు. లక్ష్మీదేవికి మీరు ఆరాధించే విధానం నచ్చిందని.. ఆమె దీవెనలు మీపై ఉన్నాయని అర్థం. కాగా జీవితంలో మీరు కీర్తి, సంతోషాలతో, అష్టఐశ్వరాలతో జీవిస్తారని సూచన.
కలలో తామరపువ్వు కనిపిస్తే..
దీపావళి రోజు రాత్రి కలలో తామర పువ్వు(Lotus flower) కనిపిస్తే కనుక ఇంట్లో మేలు జరుగుతుంది. ఏ బిజినెస్ పెట్టినా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా దూసుకుపోతారు. కాగా కలలో తామరపువ్వు కనిపిస్తే ఎలాంటి సందేహం లేదు. అంతా మంచే జరుగుతుంది.
అమృత కలశం కనిపిస్తే...
దీపావళి నాడు కలలో అమృత కలశం(Amrita Kalash) కనిపిస్తే శుభప్రదంగా చెప్పుకుంటారు. ఫ్యామిలీలో ఎవరికైన అనారోగ్య సమస్యలు ఉంటే నయమవుతాయని అర్థం. అలాగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అమృతంతో నిండిన కుండ కనిపిస్తే మేలే జరుగుతుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం కులదైవం కలలో కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం దీపావళి రాత్రి కులదైవం కనిపిస్తే ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. ఈ కలకు అర్థం.. చిరకాల కోరికలు, ప్రస్తుత ఆంక్షలు నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగం కోసం కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న వారికి త్వరలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాగా కులదైవం కనిపిస్తే ఉద్యోగం వస్తుందని సూచిస్తుంది.
వరి అండ్ గోధుమ పంట కనిపిస్తే..
దీపావళి నాడు కలలో గోధుమ, వరి(Wheat, Rice) పంట కనిపిస్తే జీవితంలో మంచి గడియలు రానున్నాయని అర్థం. ప్రస్తుతం ఎదుర్కోంటున్న సమస్యలు దూరమవుతాయని సూచిస్తుంది. ఇక మీ చెడు రోజులు మాయమవుతాయి. ఆర్థికంగా కూడా అంతా మంచి జరుగుతుంది. కలలో గోధుమ, వరి పంట కనిపిస్తే ఆర్థిక లాభాలు పుంజుకుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.