వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన Apple Watch.. ఎలాగో తెలుసా!

by Harish |   ( Updated:2022-03-18 14:28:27.0  )
వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన Apple Watch.. ఎలాగో తెలుసా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఈ మధ్మకాలంలో కొత్త స్మార్ట్ వాచ్‌ల కారణంగా కొంత మంది ప్రాణాప్రాయ స్థితి నుండి బయటపడుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి హర్యానాలో చోటుచేసుకుంది. Apple వాచ్ కారణంగా యమునానగర్‌కు చెందిన దంతవైద్యుడు పెద్ద ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. దంతవైద్యుడు అయినటువంటి నితేష్ చోప్రా తన భార్య నుండి పుట్టినరోజు బహుమతిగా Apple వాచ్ సిరీస్ 6ను పొందాడు. వాచ్‌లో అతని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG)చెక్ చేసినప్పుడు, అది రెండుసార్లు క్రమరహిత(సక్రమంగా లేని) హార్ట్‌బీట్ చూపించింది.

తర్వాత సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించి Apple వాచ్ నుంచి వచ్చిన రెండు ECG రిపోర్టులను డాక్టర్‌కు చూపించాడు. తరువాత హాస్పటల్‌లో యాంజియోగ్రఫీ టెస్ట్ చేయగా, దాని రిపోర్ట్ ఆధారంగా వైద్యులు అతనికి స్టంట్ ఇంప్లాంటేషన్‌ని సిఫార్సు చేసి గుండెకు స్టంట్ వేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. 'నా భర్త ప్రాణాలను కాపాడినందుకు Apple వాచ్‌కి, Apple CEO టిమ్ కుక్‌కి ధన్యవాదాలు' అని అతని భార్య టిమ్ కుక్‌కి ఈ-మెయిల్ పంపింది. దానికి అతను 'మీకు అవసరమైన వైద్య సహాయం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి' అని టిమ్ కుక్‌ బదులిచ్చాడు.

Apple వాచ్‌లోని ప్రత్యేక ఆరోగ్య ఫీచర్లు ఇండియాలో ఒకరి ప్రాణాలను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. 2019లో, యాపిల్ వాచ్‌లోని ECG ఫీచర్ ఇండోర్‌కు చెందిన 61 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

Advertisement

Next Story

Most Viewed