- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ మంత్రుల రాజీనామాకు ముహుర్తం ఖరారు
దిశ, ఏపీ బ్యూరో : మంత్రివర్గ విస్తరణకు సీఎం వైఎస్ జగన్ కసరత్తు పూర్తి చేశారు.కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి... ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చేశారు. అంతేకాదు కొత్తగా కేబినెట్‌లోకి ఎవరెవరిని తీసుకోనున్నారో దానికి సంబంధించి ఒక జాబితాను సైతం రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈనెల 27న మంత్రివర్గం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు కొత్త మంత్రివర్గం ప్రకటనతోపాటు ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది.
ఇకపోతే ఈసారి కేబినెట్ విస్తరణలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా మహిళకే హోంమంత్రి పదవి ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆరుగురు మంత్రులను మినహా మిగతా అందరిని మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి కేబినెట్ విస్తరణ... ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంశాలపై ఓ క్లారిటీ రానుంది.