- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. చంద్రబాబు, పవన్‌పై వెల్లంపల్లి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆపై బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి నేడు అసెంబ్లీలో శాఖల వారిగా ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల పట్ల చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేధింపులు భరించలేక మాచర్లలో మల్లిఖార్జునరావు అనే వ్యక్తి హఠాత్తుగా మరణించారని గుర్తచేశారు. అనంతరం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లిఖార్జున రావు భార్య కూడా చనిపోయిందని అన్నారు. సొంత పార్టీలోని శిద్దా రాఘవరావును అవమానించారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆర్యవైశ్య ద్రోహులు అని వ్యాఖ్యానించారు. రోశయ్యను చంద్రబాబు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.