- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీక్రెట్‌గా ఆ సింగర్‌ని లవ్ మ్యారేజ్ చేసుకున్న అనురాగ్ కులకర్ణి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి, మరో ప్రముఖ గాయని రమ్య బెహరా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక వీరి పెళ్లి శుక్రవారం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. అయితే ఈ జంట ఎవరినీ పిలవకుండా సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్లు.. ఇండస్ట్రీ నుంచి ఈ జంట ఎవరిని పిలవకుండా ఇంత సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి.. ? ఇది నిజంగానే ఒరిజినల్ ఫొటోయేనా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఈ జంట అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే. కాగా వీరిది ప్రేమ వివాహం అన్నట్లు తెలుస్తోంది.
ఇక అనురాగ్ కులకర్ణి విషయానికి వస్తే.. ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 విన్నర్‌గా నిలవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత సినిమాలలో వరుస సాంగ్స్ పాడుతూ స్టార్ సింగర్‌గా మారాడు. అలా ‘ఆర్ఎక్స్ 100’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాల్లో పాడి అవార్డులను కూడా అందుకున్నాడు. అలాగే రమ్య బెహరా విషయానికి వస్తే.. ఈ అమ్మడు కూడా ఎన్నో మంచి పాటలు పాడి మెప్పించింది.