- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి ముహూర్తం బాగోలేదు.. మా సినిమాను వాయిదా వేస్తున్నాం..
దిశ, వెబ్‌డెస్క్: గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల పరిస్థితి అయోమయంగా ఉంది. అద్భుతమైన కథ, కథనంతో తెరకెక్కుతున్నా సినిమాలు విడుదల విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తున్నాయి. చాలా వరకు సినిమాలు విడుదల తేదీ విషయంలో డైలమాలో పడుతున్నాయి. విడుదల తేదీని ప్రకటించినా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే సినిమాను వాయిదా వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ సైతం ఇదే తరహాలో విడుదలకు పట్టున పది రోజులు కూడా లేని సమయంలో రిలీజ్‌ను వాయిదా వేసింది. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా పడింది. ఈ సినిమాలో రుష్కర్ దిలోన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా మార్చి 4న విడుదల కావాల్సి ఉంది.
ఈ మూవీలో విశ్వక్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని, సినిమా కూడా కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో సినిమా విడుదలకు 48 గంటల ముందు సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 'అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెళ్ళి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం.. ఇట్లు అల్లం వారి పెళ్ళి బృందం' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రేక్షకులు నిరాశ పడ్డారు. మరి అల్లం అర్జున్ కుమార్ పెళ్ళి వేడుక ఎప్పుడు జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Madhavi promises you all it will be worth the wait❤️🌸#AshokaVanamLoArjunaKalyanam new release date to be announced soon… pic.twitter.com/Ee4T0Tu8mK
— Rukshar Dhillon (@RuksharDhillon) March 2, 2022