Game Changer: ఇట్స్ అఫీషియల్.. ఆ సంస్థ చేతికి ‘గేమ్ చేంజర్’ నార్త్ హక్కులు

by sudharani |
Game Changer: ఇట్స్ అఫీషియల్.. ఆ సంస్థ చేతికి ‘గేమ్ చేంజర్’ నార్త్ హక్కులు
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ వెయిటెడ్ (Most Weighted) సినిమాలో.. కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్ కాగా.. అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌ (Special) గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం (Movie Team) అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ (release) సమయం దగ్గర పడటంతో.. సినిమాకు సంబంధించిన ఒక్కో ఏరియా థియేటర్ (theater) హక్కులను అమ్మెస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ చేంజర్’ నార్త్‌ (North)కు సంబంధించిన హక్కులను భారీ రేటుకి అనిల్ తడాని (Anil Thadani) ఏఏ ఫిలింస్ సంస్థ దక్కించుకోగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర బృందం. కాగా.. ఏఏ ఫిలింస్ ఇప్పటికే ‘పుష్ప-2’ సంబంధించిన హిందీ రైట్స్ కూడా దక్కించుకుని.. హిందీ వర్షన్ దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

Next Story