- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త సంతోష పెట్టకపోతే విడిపోవాల్సిందే.. బాలీవుడ్ హీరో
దిశ, సినిమా: సీనియర్ హీరో అనిల్ కపూర్ నేటి వివాహ బంధాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను నటించిన తాజా చిత్రం 'జుగ్ జుగ్ జీయో' ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన.. ఈ తరమంతా తమ వైవాహిక బంధాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారన్నాడు. 'ఈ రోజుల్లో జీవితం చాలా కఠినంగా ఉందని తెలుసు. స్త్రీ తన భర్తతో సంతోషంగా ఉండలేకపోతే విడిపోవడమే బెటర్. ప్రేమలేని వారికోసం జీవితాన్ని త్యాగం చేయకూడదని కోరుకుంటాను' అని చెప్పుకొచ్చాడు. అలాగే నేటి మహిళలు బలమైన శక్తిగా మారుతున్నారన్న హీరో.. పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనే కోరికలున్నప్పటికీ తొందరపడట్లేదని అన్నాడు. ఇక గతంలో మహిళలు చిన్నవయసులోనే వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపేవారన్న అనిల్.. ఇప్పుడు అబ్బాయిలు మూడు ముళ్లు వేయడానికి తహతహలాడుతున్నారని తెలిపాడు. చివరగా త్వరలో బిడ్డను కనబోయే తన కూతురు సోనమ్ కపూర్‌కి పేరెంటింగ్ చిట్కాల గురించి తానేమి చెప్పనని స్పష్టం చేశారు.