- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారు దొంగిలించేందుకు వచ్చాడనుకొని కర్రలతో దాడి..ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తుండగా మృతి

దిశ,దోమకొండ : కారు దొంగిలించేందుకు వచ్చాడనుకొని, ఒక యువకుడి ని కర్రలతో కొట్టగా, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధితున్ని ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తుండగా, మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్ పల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ముత్యంపేట గ్రామానికి చెందిన గొల్ల రమేష్(30) ప్రైవేట్ పశువుల కాంపౌండర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన కారును, కొంత కాలం క్రితం ఇటుక బట్టీల వ్యాపారి చేసే ఓనర్ కు విక్రయించాడు. అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించడంలో బాగా డిలే చేస్తుండడం, ప్రైవేట్ ఫైనాన్స్ వారు రమేష్ పై ఒత్తిడి చేస్తుండడంతో, కారు విక్రయించిన వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. డబ్బుల చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. డబ్బులు చెల్లించడం లేదన్న కోపంతో, ఇవాళ వేకువ జామున నాలుగు గంటల సమయంలో ఇటుక బట్టీల వద్ద కు చేరుకున్నాడు.
పార్కింగ్ చేసి ఉంచిన కారును స్టార్ట్ చేసే క్రమంలో, అక్కడ బట్టి లో పనిచేస్తున్న వారు కారును అపహరించుకు పోయేందుకు వచ్చాడనుకొని, కట్టెలతో బాగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రమేష్ ను, ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య అనిత, కుమారుడు భాను ప్రసాద్, ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, నందిత ఉన్నారు. చింతమాను పల్లి గ్రామానికి చెందిన వారే తమ కుమారున్ని కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, దోమకొండ ఎస్ఐ డి స్రవంతి, బీబీపేట ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు డెడ్ బాడీని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు.