- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sugar Test: ఇంజెక్షన్ అవసరం లేదు.. షుగర్‌ను ఇలా గుర్తించవచ్చు.. IISC సరికొత్త ఆవిష్కరణ

దిశ, వెబ్ డెస్క్: Sugar Test: షుగర్ టెస్ట్ చేయాలంటే సూది గుచ్చాల్సిందే..రక్తం తీయాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రక్త పరీక్ష లేకుండానే..శరీరంలో సూది గుచ్చుకుండానే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కచ్చితంగా లెక్చించే సరికొత్త మార్గం ఆవిష్క్రుతమైంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఒక రకమైన స్కానింగ్ తరహాలో గ్లూకోజ్ లెవల్స్ ను అంచనా వేశారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతినెలా బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాల్సిందే. కొంతమంది వారానికోసారి ఇంట్లోనే షుగర్ టెస్ట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కొలిచేందుకు సూదిని ఉపయోగిస్తున్నారు.
వేలికొనల్లో చర్మానికి సూది గుచ్చడం వల్ల రక్తాన్ని సేకరిస్తుంటారు. నెలలో, వారంలో కొంతమంది షుగర్ బాధితులు రోజులో పలుమార్లు ఈ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా పదే పదే సూదులతో గుచ్చడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సూదులు గుచ్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు ముప్పు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. తరచూ సూదులు గుచ్చాల్సిన అవసరం లేకుండానే కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కొలిచే మార్గాన్ని కనుగొన్నారు. ఈ మేరకు పరిశోధకులు ఫొటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్నానాన్ని ఉపయోగించారు.
లేజర్ కాంతిని జీవకణజాలంపైకి ప్రసరించడం వల్ల కణజాలంలోని భాగాలు కాంతిని శోషించుకుంటాయి. దీంతో కాంతి వేడికి కణజాలం స్వల్పంగా వేడెక్కుతుంది. కాంతి వల్ల కణజాలం సంకోచ, వ్యాకోచాలకు గురవుతూ చిన్నపాటి ప్రకంపనలకు గురవుతుంది. అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల రూపంలో ఉండే వీటిని సున్నితమైన డిటెక్టర్లు పసిగట్టి సమాచారాన్ని అందిస్తాయి. ఈ విధానంలో సంబంధిత కణజాలానికి నష్టం కలగదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఫొటో అకౌస్టిక్ పరిజ్నానాన్ని బెంగళూరు శాస్త్రవేత్తలు ఉపయోగించుకుని కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా తీర్చిదిద్దారు. దీనికోసం ఉపయోగించిన పోలరైజ్డ్ కాంతి తరంగం నిర్దిష్ట దిశలోనే కంపిస్తూ ఉంటుంది. పోలరైజ్డ్ కాంతిలో గ్లూకోజ్ అనే చిరాల్ పదార్థం కంపర దిశగా మారిపోతుంది. ఫలితంగా వెలువడే ధ్వని తరంగాల తీవ్రతలోనూ మార్పు గ్లూకోజ్ స్థాయిని బట్టి ధ్వని తరంగ తీవ్రతను ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.