అరుదైన పింక్ డైమండ్‌.. 300 ఏళ్లలో ఇదే అతిపెద్దది!

by Mahesh |
అరుదైన పింక్ డైమండ్‌.. 300 ఏళ్లలో ఇదే అతిపెద్దది!
X

దిశ, ఫీచర్స్ : అంగోలాలోని గని కార్మికులు అత్యంత అరుదైన పింక్ డైమండ్‌ను కనుగొన్నట్లు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ తెలియజేసింది. 'ది లులో రోజ్'గా పిలువబడే ఈ డైమండ్ 170 క్యారెట్లు ఉందని.. ఈ 300 ఏళ్లలో బయటపడ్డ వాటిలో ఇదే అత్యంత పెద్దదని పేర్కొన్నారు. అంగోలాలో వజ్రాలు అధికంగా ఉండే ఈశాన్య ప్రాంతమైన లులో గనిలో ఈ వజ్రం దొరికింది. దీనిపై స్పందించిన ఆ దేశ ఖనిజ వనరుల శాఖ మంత్రి డయామంటినో అజెవెడో.. ఈ అద్భుతమైన పింక్ డైమండ్ అంగోలాను ప్రపంచ వేదికపై ఒక ముఖ్యమైన గ్లోబల్ ప్లేయర్‌గా నిలిపింది' అన్నారు. కాగా ఈ వజ్రాన్ని ఇంటర్నేషనల్ టెండర్‌లో మంచి ధరకు విక్రయించనున్నట్లు సమాచారం.

ఇలాంటి పింక్ డైమండ్స్ గతంలోనూ ఇంటర్నేషనల్ మర్కెట్‌లో రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. 2017లో హాంకాంగ్ వేలంలో 59.6 క్యారెట్ పింక్ స్టార్ స్టోన్ 71.2 మిలియన్ US డాలర్లకు విక్రయించబడింది. ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన డైమండ్స్‌లో ఇదే మొదటి స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed