అక్క‌డికి పంపితే మెడ‌ల్ గ్యారెంటీ.. అద్భుతంగా పిల్లాడి ఫీట్‌ (వీడియో)

by Sumithra |
అక్క‌డికి పంపితే మెడ‌ల్ గ్యారెంటీ.. అద్భుతంగా పిల్లాడి ఫీట్‌ (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌ట్టిలో మాణిక్యాలు ఎంతో మంది. అయితే, వారిలో ఉన్న ప్ర‌తిభ‌, నైపుణ్యాల‌ను గుర్తించి, ప్రోత్స‌హించేవారి అవ‌స‌రం చాలా ఉంది. అలా, క్షేత్రస్థాయిలో అబ్బుర‌ప‌రిచే వ్య‌క్తులను గుర్తించే విధంగా ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తరచుగా ఇంటర్నెట్‌లో ఆసక్తిని రేకెత్తించే పోస్ట్‌లను పంచుకుంటారు. ఈసారి కూడా ఓ మ‌ట్టిలో మాణిక్యాన్ని పరిచ‌యం చేస్తూ, "తర్వాతి తరం ప్రతిభ"ని ప్రదర్శించే వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో ఒక పిల్లాడు రోడ్డు మధ్యలో పల్టీలు కొట్టడం చూడొచ్చు. దీనికి సంబంధించి, "మేము ఈ ప్రతిభను ఫాస్ట్ ట్రాక్‌లోకి తీసుకురావాలి" అని మహీంద్రా క్యాప్ష‌న్‌లో రాశారు.

అయితే, తమిళనాడులోని తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో బాలుడు చేస్తున్న ఫీట్‌ని అతని స్నేహితుల్లో ఒకరు వీడియోను రికార్డ్ చేసి, పంచుకోగా.. ఆనంద్ మ‌హీంద్రా "#CWG2022లో భారతదేశం కోసం గోల్డ్ రష్, తర్వాతి తరం ప్రతిభ రూపుదిద్దుకుంటోంది. కానీ, మద్దతు లేదు," అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్ (CWG2022)ను ఉద్దేశిస్తూ, భ‌విష్య‌త్తులో ఇలాంటి వారిని గుర్తించాల‌ని చెప్ప‌డంపై అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. నెటిజన్లు ఈ చిన్న పిల్లవాడిని "భవిష్యత్ ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్" అని పిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed