టానిక్ అనుకొని పురుగుల మందు తాగిన వృద్ధుడు మృతి

by Manoj |   ( Updated:2022-03-24 16:54:56.0  )
టానిక్ అనుకొని పురుగుల మందు తాగిన వృద్ధుడు మృతి
X

దిశ, కుత్బుల్లాపూర్ : టానిక్ అనుకొని పురుగుల మందును తాగిన ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్ మాణిక్య నగర్‌కు చెందిన సూర్యనారాయణ(72) ఇంట్లోనే ఉంటాడు. అయితే ఈనెల 14వ తేదీన మద్యం మత్తులో టానిక్ అనుకొని చెట్లకు కొట్టే మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed