Telangana News: చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేయబోయిన అపరిచితుడు..

by Vinod kumar |   ( Updated:2022-04-11 11:23:05.0  )
Telangana News: చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేయబోయిన అపరిచితుడు..
X

దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు ఓ అపరిచిత వ్యక్తి ప్రయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్కూల్ కి వెళ్తున్న విద్యార్థినికి తాగిన మైకంలో ఉన్న ఓ అపరిచిత వ్యక్తి చాక్లెట్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిన ఆ విద్యార్థిని వెంటనే క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ వ్యక్తి క్లాస్ రూం కిటికిలో నుండి కూడా చూడగా.. భయంతో విద్యార్థిని సోదరుడు పేరెంట్స్ కు చెప్పారు. ఈ క్రమంలో స్థానికులు, పేరెంట్స్ ఆ అపరిచిత వ్యక్తిని కిడ్నాపర్ గా భావించి, పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని, పిల్లల భద్రతను గాలికి వదిలేశారని పేరెంట్స్ ఆరోపించారు. కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. అనంతరం ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story