Puri Jagannadh దంపతుల విడాకులపై క్లారిటీ ఇచ్చిన శంకరన్న

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-16 07:23:39.0  )
Amberpet Shankar Gives Clarity About Puri Jagannadh and Lavanya Divorce Issue
X

దిశ, వెబ్‌డెస్క్: Amberpet Shankar Gives Clarity About Puri Jagannadh and Lavanya Divorce Issue| డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. సీనియర్ హీరోయిన్ ఛార్మీతో పూరీ ఎఫైర్ నడుపుతున్నాడని, వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో లావణ్యకు పూరీ విడాకులు ఇవ్వనున్నాడనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇటీవల పూరీ కొడుకు, హీరో ఆకాశ్ పూరీ క్లారిటీ ఇచ్చాడు. అమ్మనాన్న చాలా సంతోషంగా ఉన్నారని, విడాకుల వార్తలు వాస్తవం కాదని తెలిపాడు. ఈ క్రమంలో పూరీ దంపతుల విడాకుల వార్తలపై వారి పెళ్లి చేసిన అంబర్‌పేట్ శంకరన్న క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలు నిజం కాదని, వారిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశాడు. పూరీ, లావణ్యలది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయగా.. అంబర్ పేట్ శంకరన్న వారి పెళ్లి జరిపించాడు.


ఇవి కూడా చ‌ద‌వండి

తొలి సంభోగం తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్‌కి ఇలా చెక్ పెట్టండి?

ఆది ఆ ఒక్కడైలాగ్‌తో.. సుధీర్‌తో లవ్‌పై ఓపెన్ అయిన రష్మీ ?

లలిత్ మోదీతోనే కాదు.. 9 మందితో సుస్మితా సేన్ డేటింగ్!


Advertisement

Next Story