- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు తీపికబురు అందేనా.. గ్రామ గ్రామాన వివో భవనాలొచ్చేనా ?
దిశ,ఖానాపూర్: గ్రామాల్లో ఇందిరా క్రాంతి పథకం కింద వివో భవనాల కోసం స్థల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. ఖానాపూర్ మండల వ్యాప్తంగా 30 (వివో) గ్రామైక్య సంఘాలుండగా, వివోలు 20 గ్రామపంచాయితీల పరిధిలో ఐ.కె.పి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాలకి వివిధ సేవలు అందిస్తున్నాయి. వివో మీటింగ్‌లని నిర్వహించి మహిళలకి ఆర్థిక స్వావలంభన సాధించటంలో ఈ సంఘం పాత్రవహిస్తుంది. వివో అధ్వర్యంలో 20 నుంచి 30 డ్వాక్రా సంఘాలు ఉంటాయి. వివో పరిధిలోని డ్వాక్రా సంఘాల అధ్యక్షుల నుండి ఓటింగ్ ద్వారా ఒకరిని వివో అధ్యక్షురాలిగా నియమిస్తారు. ఇన్ని సంఘాల నిర్వహణ, సమావేశాలకి సరైన భవనం లేకపోవడం, అదే సమయంలో సి.ఏ లకి కూడా గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం అంటూ లేకపోవడంతో వీరు ఇబ్బందులకి గురవుతున్నారు. ఇదే విషయం స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దృష్టికి మహిళ సంఘాల ప్రతినిధులు తీసుకువచ్చారు. మహిళా సంఘాలు వివో కార్యాలయ ఏర్పాటు కోసం కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామ స్థాయిలో వివో భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించి తీర్మాణం పంపించాల్సిందిగా కోరారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములని పరిశీలించి భవనం కోసం స్థలం కేటాయిస్తూ తీర్మానం పంపాల్సిందిగా సర్పంచ్‌లను ఆదేశించారు.
సర్పంచ్‌ల ద్వారా స్థలం కేటాయింపు చేసిన తీర్మానం సిఏల ద్వారా ఐకేపీ వెలుగు కార్యాలయానికి చేరుకోగా ఏ.పి.ఎం వాటిని తహసశీల్దార్ ద్వారా స్థల స్వభావాన్ని సర్వే నెంబర్‌ని జత చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సమర్పించారు. మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయితీలలో బుధరావుపేట గ్రామంలో అసంపూర్తిగా నిర్మించిన వివో భవనం ఉండగా, మంగళవారిపేటలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేక కేటాయింపులు జరగలేదు. కాగా, మిగిలిన 18 గ్రామాల్లో ఖానాపూర్ గ్రామంలో పాత బందరు దొడ్డిగా ఉపయోగించిన 4గుంటల స్థలాన్ని, మనుబోతులగడ్డ, ధర్మారావు పేట,కొడ్తిమాట్ తండ, వేపచెట్టు తండ, నాజీ తండాలో 3గుంటలు, బండమామిడి తండ, చిలుకమ్మ నగర్, అశోకనగర్ గ్రామాల్లో 2 గుంటల చొప్పున స్థలం కేటాయించారు. అదేవిధంగా అయోధ్యానగర్, దబీర్ పేట, కీర్య తండ, రంగాపూర్, రాగం పేటల్లో 4 గుంటలు, బోటిమీది తండ, భద్రు తండాలలో 5గుంటల చొప్పున వివో భవనానికి స్థలం కేటాయిస్తూ తీర్మానం పంపించారు.
ఎమ్మెల్యే పెద్ది చొరవతో త్వరగా స్థల కేటాయింపుల తీర్మాన పర్వం ముగిసినప్పటికీ అవి కేటాయింపుల అనుమతి కోసం డి.ఆర్.డి.ఏ కి సమర్పిస్తారు. అక్కడ నుండి కలెక్టర్ కార్యాలయానికి పంపిన తర్వాత సంఘాలకి స్థలాలు కేటాయించే అవకాశం ఉంటుంది. స్థలం అడ్వాన్స్డ్ స్థితి సరి చూసుకొని ఎలాంటి సమస్య లేనట్లయితే నే స్థలం ఆ సంఘాలకి అపగించబడుతుంది.ఇదంతా త్వరగా పూర్తయి త్వరిత గతిన గ్రామ స్థాయిలో వివో భవనాలు నిర్మించేలా ఎమ్మెల్యే చొరవ తీసుకుంటారని మహిళా సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తమ కంటూ స్వంత భవనం ఉంటే మహిళా సంఘాలు వివో సమావేశాలు నిర్వహించుకోవడం, గ్రామంలోని 20 కి పైగా డ్వాక్ర సంఘాల రికార్డులు నిర్వహించడం సులభం కానుంది.