- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డబుల్ బెడ్‌రూం ఇళ్లు అర్హులకే ఇవ్వండి.. సీపీఐ
by Web Desk |

X
దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో సీపీఐ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైనా ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని, దళిత బంధు ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు రూ.10 లక్షలు అందజేయాలని కోరారు. వితంతు, ఒంటరి మహిళలకు వెంటనే పెన్షన్స్ మంజూరు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పానుగంటి పర్వతాలు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు చందు యాదవ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story