- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటితో కలిసి ప్రయాణం.. మాజీ ఎమ్మెల్సీ కీలక నిర్ణయం?
దిశ, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం కొత్తగూడెంలో ప్రభుత్వ విప్ క్యాంపు కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించుకున్నారు. ఆహ్వానం ఉన్నదో లేదో తెలియదు గానీ, ఈ జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. కానీ ఇదే రోజున భద్రాచలంలో జరిగిన ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బాలసాని లక్ష్మీనారాయణ హాజరైనారు. బాలసాని ఓ గంట ముందుగానే వచ్చి పొంగులేటి రాక కోసం నిరీక్షించినట్లుగా అభిమానులు చెప్పడం గమనార్హం.
బలమైన నాయకుడి వెంట ఉంటేనే భవిష్యత్..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగబలం, అర్థబలం కలిగిన ప్రజానాయకుడు అన డంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పీకె సర్వే రిపోర్టు తేల్చి చెప్పిన నేపథ్యం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కచూ పులు చూడకుండా పార్టీలోనే కొనసాగే విధంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. గ్రూపులకు కేంద్ర బిందువులైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల మధ్య సయోధ్య కోసం ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం వచ్చి విందు రాజకీయం చేసి వెళ్ళారు. ఉప్పు నిప్పుగా ఉంటున్న ఆ ముగ్గురు నాయకులు కలవడం అంత ఈజీ కాదనేది యదార్థం అయితే పొంగులేటికి ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ గాలం వేస్తుండటంతో ఆయన టీఆర్ఎస్‌లోనే ఉంటారా లేక సరైన సమయంలో పార్టీ మారుతారా అనేది రాజకీయ పరిశీలకులకు సైతం అంతుచిక్కడం లేదు. అయితే పొం గులేటి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన్ని నమ్ముకొని అడుగులేసే నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగదనేది జనంలో వినిపిస్తున్న మాట. టీఆర్ఎస్ అధిష్టానం సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ భవిష్యత్తు కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒకచోటపోటీ చేయాలనుకునేవారు లేదా రాజకీయంగా లబ్ధిపొందాలనుకునే వారు ముందుచూపుతో పొంగులేటి వెంట అడుగులు వేస్తున్నట్లు రాజకీ య పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి తనతోపాటు తన అనుచరులకు కూడా టిక్కెట్లు సాధించుకుంటారనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది. ఆ కోవలోనే ఇల్లందు సీటు ఆశిస్తున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక సీటు కోరుతున్న మాజీ ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు వంటివారు ఇప్పటికే పొంగులేటితో కలిసి ప్రయాణం చేస్తున్నారు.
పొంగులేటితో కలిసి ప్రయాణం..
ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బీసీ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ. భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం మండలం మరికాల గ్రామానికి చెందిన ఆయన టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో పలు కీలక పదవులు చేపట్టారు. మొన్నటివరకు ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయనకు జనవరిలో పదవీకాలం పూర్తికాగానే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లేదా నామినేటెడ్ పోస్టు దక్కుతుందని అందరు భావించా రు. కానీ మాజీ మంత్రి తుమ్మ ల, మాజీ ఎంపీ పొంగులేటి మాదిరిగానే పదవుల కోసం మాజీ ఎమ్మె ల్సీ బాలసాని నిరీక్షిస్తున్నారు. పార్టీలో ఒంటరి ప్రయాణం కంటే పొంగులేటితో జతకట్టడం వలన రాజకీయంగా మరింత మేలు కలుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగు లేటి టీఆర్ఎస్‌లో ఉంటే ఆయనతోపాటు ప్రాధాన్యం లభిస్తుందని, ఒకవేళ పార్టీ మారితే గతంలో పోటీచేసిన ఖమ్మం సీటు దక్కకపోతుందా అనే అంచనాలతో ఉన్నట్లు ఆయన అభిమానులు భావిస్తున్నారు. పొంగులేటి, బాలసాని జత కడితే హిట్ జంటగా అభిమానులు చెబుతున్నారు. అయితే బాలసాని మాత్రం వర్గాలు, విభేదాలు అనే ప్రస్తావన రాకుండా తనదైన శైలిలో కారులో ప్రయాణిస్తున్నారు.