- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తారింటి వారితో డిన్నర్ చేసిన అక్కినేని కోడలు.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వారు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. వీరికి సంబంధించి ఏ విషయమైన నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. అందులో భాగంగా తాజాగా శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం ఫొటో షేర్ చేయగానే కొన్ని లక్షల వ్యూస్‌తో పాటు వేల లైక్స్ వచ్చాయి. ఇక అప్పటినుంచి వీరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
రెండు రోజుల క్రితం, అంతా దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలు కూడా ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో శోభిత.. తన అత్తవారి కుటుంబసభ్యులతో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. తొలుత ఇన్స్టాలో ఆమె విషెస్ తెలిపారు. తన ఫొటోను ముద్రించి ఉన్న టపాసుల చిత్రాలను షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత తన అత్తమామలు నాగార్జున- అమల, కాబోయే భర్త నాగ చైతన్య, మరిది అఖిల్ తో డిన్నర్‌కు వెళ్లారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ చేయకపోయినా.. వారు వెళ్లిన రెస్టారెంట్ చెఫ్ షేర్ చేశారు. అంతా స్పెషల్ సింబల్‌తో క్రేజీగా కనిపించారు. నాగార్జున, అఖిల్ ట్రెడిషనల్ వేర్‌లో సందడి చేశారు. అమల క్యాజువల్ ఔట్ ఫిట్‌లో ఉన్నారు. కొత్త జంట మాత్రం అదరగొట్టారు. నాగచైతన్య బ్లాక్ అండ్ బ్లాక్‌లో ఆకట్టుకున్నారు. శోభిత ప్లెయిన్ శారీలో మెరిశారు. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ పిక్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
ఇదొక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అంటూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దేని గురించంటే..?