14.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఐశ్వర్యరాయ్.. కానీ ఈ బ్యూటీ ఫాలో అయ్యేది మాత్రం ఆ ఒక్కరినే..

by Kavitha |   ( Updated:2024-10-25 15:06:03.0  )
14.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఐశ్వర్యరాయ్.. కానీ ఈ బ్యూటీ ఫాలో అయ్యేది మాత్రం ఆ ఒక్కరినే..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ భామ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. అయితే ఈ జంట కొన్ని రోజుల నుంచి విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఐష్ ఎక్కడికి వెళ్లిన తన కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్తుంది. కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం కనిపిస్తలేదు. దీంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐష్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బాగా పాపులర్ అయింది. అలా ఈమె 14.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. మరి ఇంత మంది ఈ భామను ఫాలో అవుతుంటే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. మరి ఇంతకీ ఈమె ఫాలో అవుతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..? తన భర్త అభిషేక్ బచ్చన్. ఐశ్వర్యరాయ్ ఇన్‌స్టా గ్రామ్‌లో కేవలం తన భర్తను మాత్రమే ఫాలో అవుతుంది. ఇక ఈ బ్యూటీ గతంలో తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. కానీ విడాకుల రూమర్స్ వస్తున్నప్పటి నుంచి మాత్రం అతనితో కలిసి పిక్స్ దిగడం కానీ, గతంలో దిగిన వాటిని పోస్ట్ చేయడం కానీ జరగలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed