- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల ముందుగానే గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించే ఏఐ అల్గారిథం!
దిశ, ఫీచర్స్ : 'గుండెపోటు'తో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యువత నుంచి మధ్య వయస్కుల వరకు హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు విడుస్తున్నారు. గుండెపోటు లేదా మరణ ప్రమాదాన్ని అంచనా వేయడంలో మానవ వైద్యుల కంటే మెరుగైన కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మేరకు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లోని ఫలకం పరిమాణం, కూర్పు ఆధారంగా ఐదేళ్లలో ఏ రోగులు గుండెపోటును ఎదుర్కోబోతున్నారో కచ్చితంగా అంచనా వేసింది.
ధమనుల్లో ఫలకం ఏర్పడి పగిలిపోవడం వల్ల గుండెకు రక్తం చేరడం కష్టతరం కావడంతో హార్ట్‌ఎటాక్ వచ్చే సంభావ్యత పెరుగుతుంది. అయితే కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ (CTA) అని పిలువబడే వైద్య పరీక్ష గుండె, ధమనులకు సంబంధించిన 3D చిత్రాలను అందిస్తుంది. దీని ద్వారా రోగికి సంబంధించిన ధమనులు ఎంత కుచించుకుపోయాయో వైద్యులు అంచనా వేయవచ్చు. అయితే ఇప్పటి వరకు, CTA చిత్రాల్లో కనిపించే ఫలకాన్ని కొలవడానికి సులభమైన, వేగవంతమైన మార్గం లేదు.
కానీ తాజాగా డెవలప్ చేసిన ఏఐ ఆల్గారిథం ఆధారంగా CTA చిత్రాల్లోని ప్లేక్ క్వాంటిటీని ఐదు నుంచి ఆరు సెకన్లలో లెక్కించవచ్చని తెలిపారు పరిశోధకులు. ఇందుకోసం ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, స్కాట్లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కరోనరీ CTA చేయించుకున్న 1,196 మంది వ్యక్తులకు సంబంధించిన CTA చిత్రాలను పరిశోధకులు విశ్లేషించారు. అయితే క్లినిక్స్‌లో ఈ పరికరాన్ని ఉపయోగించే ముందు ధ్రువీకరణ పొందాల్సి ఉంది.
'ఇది ఓ ముందడుగు మాత్రమే. ప్రస్తుతం కాకపోయినా AI సాధనాలు రోగులకు తక్షణ ప్రమాద నివేదికలను అందించేందుకు డయాగ్నొస్టిక్ ఇమేజింగ్‌ను వేగంగా విశ్లేషించగల భవిష్యత్తు సాధనమని చెప్పొచ్చు. అయితే ఈ ప్రామాణిక పరీక్షతో ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటే, అది ఎంత త్వరగా ఉంటుందో మనం అంచనా వేయగలం' అని పరిశోధకుల బృందం తెలిపింది.