- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరికీ చెప్పుకోలేని విధంగా టార్చర్ చేశాడు.. బ్రేకప్‌పై దివ్య
దిశ, సినిమా: బీ టౌన్ యాక్ట్రెస్ దివ్య అగర్వాల్.. వరుణ్ సూద్‌తో విడిపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. తనకన్నా రేండేళ్లు చిన్నవాడైన నటుడితో కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ బ్యూటీ.. ఇటీవల తన ప్రవర్తన బాగాలేదని, బ్రేకప్ చెప్పానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భవిష్యత్తులో వరుణ్ సూద్‌తో తన సంబంధం ఎలా ఉంటుందో ఊహించగలిగానని, అందుకే సంతోషంగా ముందే విడిపోవడం మంచిదని భావించానని చెప్పింది.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు కొంతమంది తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న నటి.. ఈ డెసిషన్ తీసుకునేందుకు బయటకు చెప్పలేని ప్రైవేట్ విషయాలు చాలా ఉన్నాయని తెలిపింది. ఇక వాటిని బహిర్గతం చేయకపోవడమే ఉత్తమమని పేర్కొన్న దివ్య.. మనల్ని బాధపెట్టే విషయాల గురించి ఎప్పటికీ మాట్లాడకోకపోవడమే మంచిదని, కొన్ని గుడ్ మెమొరీస్ మనతో ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోకూడదని చెప్పింది.