'ఆర్ఆర్ఆర్ కంటే ఆదిపురుష్ ఎక్కువ కనెక్ట్ చేస్తుంది'

by Manoj |
ఆర్ఆర్ఆర్ కంటే ఆదిపురుష్ ఎక్కువ కనెక్ట్ చేస్తుంది
X

దిశ, వెబ్‌డెస్క్: SS రాజమౌళి తాజా యాక్షన్ ఎపిక్ 'RRR' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైన ప్రతి భాషలోనూ ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అయితే, RRR చిత్రానికి పౌరాణిక టచ్ కూడా ఉంది. చిత్రం చివరిలో, రాజమౌళి అల్లూరి పాత్రను శ్రీరాముడిగా, కొమరం భీమ్ పాత్రను హనుమంతుడిగా చూపించాడు. ఇక్కడ తన రాముడిని రక్షించడానికి హనుమంతుడు రావణ లంక (బ్రిటిష్ కోట)కి వెళ్తాడు.

ఈ పాయింట్ చాలామంది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కాగా, ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్, తమిళనాడులోని బీజేపీ మీడియా ప్రతినిధి ఎస్‌జి సూర్య మాట్లాడుతూ.. " ఆర్‌ఆర్‌ఆర్ కంటే ఆదిపురుష్ ప్రేక్షకులను ఎక్కువ కనెక్ట్ చేస్తుంది" అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సూర్య క్రియేట్ చేసిన హైప్‌ని ఆదిపురుష్ అందుకుంటాడో లేదో చూడాలి. చాలామంది బీజేపీ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఆదిపురుష్‌కు తమ మద్దతును అందించారు. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.

Advertisement

Next Story

Most Viewed