నా జీవితం ఇలా మారుతుందనుకోలేదు.. రాశీ ఖన్నా

by Mahesh |   ( Updated:2022-03-20 11:28:27.0  )
నా జీవితం ఇలా మారుతుందనుకోలేదు.. రాశీ ఖన్నా
X

దిశ, సినిమా : అందాల తార రాశీ ఖన్నా తన కెరీర్‌ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీ బాట పట్టిన రాశి.. జీవితం తను అనుకున్నట్లు సాగలేదని, రచయిత కావాలనుకుని చివరకు నటిని అయ్యానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. 'నిజానికి కాపీ రైటర్‌ కావాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యా. డిగ్రీ పూర్తవగానే అందుకు సంబంధించి ఓ స్పెషల్ కోర్సు చేద్దామనుకున్నాను. అంతలోనే 'మద్రాస్‌ కేఫ్‌'లో చాన్స్ లభించింది.

ఆ వెంటనే అవసరాల శ్రీనివాస్‌ 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలో క్యారెక్టర్ నచ్చడంతో అది కాదనలేకపోయాను. దీంతో ఇలా నటిగా సెటిల్ అయిపోయాను' అని వివరించింది. ఇక 'రుద్ర' వెబ్‌ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ఇంత స్పందన ఊహించలేదని పేర్కొంది. ఇందులో తాను చేసిన 'ఆలియా చోక్సీ' పాత్రకు ఇప్పటికీ ప్రశంసలు అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed