ఆ బాధ వర్ణనాతీతం.. తిండి, నిద్రలేక నరకం చూశా.. యంగ్ బ్యూటీ

by Manoj |
ఆ బాధ వర్ణనాతీతం.. తిండి, నిద్రలేక నరకం చూశా.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: పంజాబీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా తెలుగుతోపాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ సత్తా చాటుతోంది. అయితే ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ సరసన 'F3'లో నటిస్తున్న అమ్మడు.. తాజాగా సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. నటుల జీవితం రంగుల ప్రపంచం, కోట్ల రూపాయలు, లగ్జరీ లైఫ్‌ అనుకుంటారు కానీ అనేక కష్టాలుంటాయని చెప్పింది. 'ఏ రంగంలోనైనా ఇబ్బందులు ఎదురవుతాయి.

అందరూ ఊహించినట్లు సినిమా జీవితం అద్భుతంగా ఉండదు. స్టార్స్ లైఫ్ చాలా విచిత్రంగా ఉంటుంది. అనూహ్యంగా విజయాలు అందుతాయి. అంతలోనే అపజయాలు వెంటాడుతాయి. ఒక్క రాత్రిలోనే జాతకాలు తారుమారు అయిపోతుంటాయి. షూటింగ్ కోసం ఎక్కడెక్కడో గూడు చెదిరిన పక్షిలా తిరుగుతుంటాం. కొన్ని కఠిన పరిస్థితుల్లో షూటింగ్స్‌ చేయాల్సి వచ్చినపుడు సమయానికి భోజనం, నిద్ర ఉండదు. అన్నింటికంటే ఎంతో ప్రేమించే కుటుంబానికి, స్నేహితులకు దూరంగా గడపాల్సి రావడం చాలా బాధగా ఉంటుంది' అని వివరించింది. అలాగే ఎన్ని కష్టాలెదురైనా సినిమాను గొప్ప కళారూపంగా గౌరవిస్తామని తెలిపింది మెహ్రీన్.

Advertisement

Next Story

Most Viewed