హిజాబ్‌‌ ధరించి నటి డ్యాన్స్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

by Sathputhe Rajesh |
హిజాబ్‌‌ ధరించి నటి డ్యాన్స్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌
X

దిశ, సినిమా : కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాక్‌అప్' షో ద్వారా నటి మందనా కరిమి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా తరచూ పర్సనల్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె చేసిన ఒక ఇన్‌స్టా రీల్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆమె బురఖా ధరించి డ్యాన్స్ చేసిన వీడియోను 'హిజాబ్‌తో షూటింగ్ చేయడం.. ఇలాంటి బిహైండ్ ది సీన్స్ కంటే సులభంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. అయితే అప్‌లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. హిజాబ్‌ను అగౌరవపరిచినందుకు నెటిజన్ల నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఓ యూజర్.. 'సిగ్గుండాలి! హిజాబ్‌ను ఇలా అగౌరవపరచవద్దు. ఇలాంటి చర్యలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి!' అంటూ ఘాటుగా కామెంట్ చేశాడు.



Advertisement

Next Story

Most Viewed